ఈ నెల 16న...
శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో,,,విగ్రహ పున:ప్రతిష్టాపన
మహాబలేశ్వరంలో అమ్మవారి విగ్రహం తయారి
శ్రీ శ్రీ మాతా నిర్మలానంద యోగ భారతీ చేతుల మీదగా విగ్రహ పున: ప్రతిష్టాపణ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ దూద్ బౌలిలోని శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో ఈ నెల 16న విగ్రహ పున:ప్రతిష్టాపన మహోత్సవం జరగనున్నది. శుక్రవారంనాడు జరిగే ఈ కార్యక్రమంలో తమిళనాడులోని మధురై ప్రాంతంలోని మహాబలేశ్వరంలో తయారు చేసిన విగ్రహాన్ని శ్రీ శ్రీ మాతా నిర్మలానంద యోగ భారతీ చేతుల మీదగా పున: ప్రతిష్టాపణ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులు కట్ట వెంకటాచలం ముదిరాజ్, దోరేటి ఆనంద్ గుప్త, బలబోజు శ్రీనివాస చారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన సకల దేవతల మండప అలంకారము, గణపతి హోమం నిర్వహిస్తారు. తమిళనాడులోని మహబలేశ్వరంలో తయారైన అమ్మవారి విగ్రహాన్ని సాయత్రం నాలుగు గంటలకు మహారాజ్ గంజ్ నుంచి దూద్ బౌలిలోని శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయం వరకు భారీ ఊరిగింపుగా తీసుకురానున్నట్లు వారు వెల్లడించారు.
ఈ సందర్భంగా బస్తీ వాసులు, భక్తులు గడపగడపకు అమ్మవారికి సాక మరియూ హారతి ఇచ్చి స్వాగతం పలకాలని వారు కోరారు. అదే విధంగా ఈ నెల 17న ఉదయం 8గంటలకు మహాగణపతి పూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాశనం, రుత్విక్ వరణం, రక్షాకంకణధారణ, అఖండ దీపారాధన ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నిమిషాలకు మృత్ సంగ్రహణం, అంకురారోపనం, ఉదయం 11 గంటలకు సర్వతోభద్రవాస్తు యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ మాతృక, ప్రధాన కులశస్థాపన పూజ జరుగుతంది. అనంతరం 11:30లకు అదే రోజు సాయంత్రం 7 గంటలకు పూజలు, హోమాలు, ధన్యాదివాసంం, ధనాధివాసం, వస్త్రాదివాసాలు జరుగుతాయని వెల్లడించారు.చివరి రోజైన 18వ తేదీనాడు ప్రాతకాలపు పూజలు, హోమాలు, గరిక పూజలు, పీఠపూజలు, గర్తన్యాసం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, అష్టబలి, మహాబలి, చండిహోమం నిర్వహిస్తారని, అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న భక్తులు పాల్గొన్నాలని వారు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయానికి దాదాపు 3 దశాబ్దాల చరిత్ర ఉంది. బోనాల వంటి పండుగల వేల పెద్ద ఎత్తున్న ఇక్కడ భక్తులు హాజరవుతారు. తమ మొక్కు నెరవేరాక ఇక్కడ మొక్కులు చెల్లించుకొంటూ ఉంటారు.
Home
Unlabelled
ఈ నెల 16న... శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో,,,విగ్రహ పున:ప్రతిష్టాపన,,, మహాబలేశ్వరంలో అమ్మవారి విగ్రహం తయారి ,,, శ్రీ శ్రీ మాతా నిర్మలానంద యోగ భారతీ చేతుల మీదగా విగ్రహ పున: ప్రతిష్టాపణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: