ఈ నెల 12న ప్రైమినిష్టర్ నేషనల్ అప్రెంటీస్ మేళ.. 

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఈ నెల 12న ప్రైమినిష్టర్ నేషనల్ అప్రెంటీస్ మేళా ప్రారంభమవుతుందని, నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఓ‌ల్డ్ సిటీ గవర్నమెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపల్ తెలిపారు. వచ్చే సోమవారంనాడు జరిగే ఈ మేళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఐటీఐ, పీఎంకేవీవై, ఇంటర్ స్థాయి ఒకేషనల్ కోర్సు, డిప్లమా, డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ మేళను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ మేళాలో పాల్గొనదల్చిన వారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లతోపాటు బోనోఫైడ్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను వెంట తీసుకొని రావాలని ఆయన సూచించారు. ఈ మేళకు సంబంధించి ఏమైన సందేశాలుంటే 040-24461815 నెంబర్ కు పనిదినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయవచ్చని ఆయన వెల్లడించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: