వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం సమర్థవంతంగా అమలు చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం కర్ణ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.రోజు రోజుకు నిత్యవసర ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయని, వ్యవసాయ కూలీలు నిత్యవసర ధరలు కొనే పరిస్థితులలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు, వ్యవసాయ కూలీలకు రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని, పక్క రాష్ట్రంలో ఉన్న కేరళ రాష్ట్రంలో సిపిఎం గవర్నమెంట్ రోజు కూలి 700 రూపాయలు ఇస్తుందని అన్నారు.ప్రభుత్వ భూములు కొంతమంది వ్యక్తుల దగ్గర ఉన్నాయని, వాటిని వెలికి తీసి అసైన్మెంట్ చట్ట ప్రకారము భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతముగా అమలు చేసి జాబు కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రెండు వందల రోజు లు.పని దినాలు కల్పించీ రోజు కూలి ఆరు వందలు ఇవ్వాలని,పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు కావలసిన వసతులు కల్పించాలని, జగనన్న ఇళ్లకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారానికై రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగన్న, కృష్ణ, శ్రీను ,మౌలాలి, మదర్సా రైతు సంఘం నాయకులు రామిరెడ్డి సిఐటియు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: