జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగస్వాములు కండి

గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలం లోని స్థానిక గడివేముల లోని గ్రంథాలయంలో 14 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు "55" వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, 14 వ తేదీన బాలల దినోత్సవం, 15 వ తేదీన పుస్తక ప్రదర్శన, 16 వ తేదీన గ్రంథాలయ స్థాపనకు ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించడం, 17 వ తేదీన కవి సమ్మేళనాలు, సెమినార్లు, 18 వ తేదీన పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 19 వ తేదీన మహిళా దినోత్సవం, 20 వ తేదీన గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఉంటుందని, గ్రంథాలయ పాఠకులు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గడివేముల గ్రంథాలయాధికారి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: