ఇల్లు లేని నిరుపేదలకు గృహాలను నిర్మించాలి

ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం లోని పారుమంచాల గ్రామం లో నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  పారుమంచాల గ్రామం కోటవీధి లోని  మహిళలతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్ణ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు భూమి, ఉపాధి, నిరుపేదలు ఉండేందుకు ఇల్లు  నిర్మించకపోవడం బాధాకరమని, కోట వీధిలో ఉన్న షరీఫా అనే మహిళ పూర్తిగా పడిపోయిన ఇంటిలో వంట వండుకొని పనికి వెళ్లి సాయంత్రం వచ్చే సరికి కాకులు, కుక్కలు, కోతులు వంట సామాగ్రిని పూర్తిగా ఎత్తుకెళ్లి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఇప్పటికైనా అధికారులు ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి తక్షణమే బిల్డింగులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఉపాధి పనులు చేసి దాదాపు 7 , 8 నెలలు గడుస్తున్న బిల్లులు మంజూరు కాలేదని వెంటనే పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీలకు బిల్లులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలను ఏకం చేసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: