డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుా...వారం రోజుల పాటు
కేంద్రం వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహుర్తం పిక్స్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరులో జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్రం ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్రం చర్యలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు వివరించాలని, తెలంగాణ ప్రగతికి కేంద్రం ఎలా అడ్డుతగులుతోందో అందరికీ తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై సమావేశాల్లో చర్చిద్దామని తెలిపారు.
Home
Unlabelled
డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుా...వారం రోజుల పాటు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: