బిలకల గూడూరు గ్రామంలో...తాగునీటీ పైపులైన్ల లీకేజీలు

మురికి కాలువ నీటితో మంచినీరు కలుషితం

పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బంది

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాగడివేముల మండల పరిధిలోని బిలకలగూడూరు గ్రామంలో జిందాల్ ఫ్యాక్టరీ కి వెళ్లే మసీదు ఎదురుగా ఉన్న ముస్లిం కాలనీలో మంచినీటి పైపులైన్లు లీకేజీల కారణంగా  నీరు కలుషితం కావడమే కాకుండా  వృధాగా రోడ్ల వెంట చిన్నపాటి కాలువలా ప్రవహిస్తుంది. నీరు కలుషితం కారణంగా గ్రామంలోని పిల్లలు, వృద్ధులు అనారోగ్య బారినపడి ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యశాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గ్రామపంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది నిత్యం ప్రయాణించే రహదారి వెంట మంచినీరు కాలువ నీటితో కలుషితమైన పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,నీరు కలుషితం కావడం వల్ల ప్రజలు డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ లతో ఇబ్బందులు పడుతున్న  పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు లీకేజీలను పరిశీలించి మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేసీ గ్రామస్తుల ఆరోగ్యం కాపాడవలేనని బిలకలగూడూరు గ్రామ ముస్లిం కాలనీవాసులు కోరుకుంటున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: