కెసిఆర్ పాలనలో... ప్రగతి పథంలో పట్టణాలు

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు ప్రగతిలో దూసుకెళ్తున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి దోహదపడే మౌలిక సదుపాయాల కల్పనకు కేసిఆర్ పెద్దపీట వేస్తున్నారని ఆమె కొనియాడారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలోని వార్డ్ నెంబర్ 10 ,13, 15 లలో రూ. 38 లక్షల రూపాయలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్డు పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్  నేతృత్వంలో పట్టణాలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు, ప్రతి నెల నిధులు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. తాగునీటి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు, సమీకృతా మార్కెట్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.


 


 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: