పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కెసిఆర్ ప్రత్యేక చొరవతో రోడ్ల విస్తరణ కార్యక్రమం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సీసీ  రోడ్ల  ప్రారంభోత్సవం.. మన ఊరు మనబడి పథకం కింద మంజూరైన పనులకు, బీటీ రోడ్ల పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అదే సందర్భంలో నందు పల్లి గ్రామంలో సీసీ రోడ్డును,పడమటి తండా గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని  రోడ్లకు నిధులు విడుదల చేసారన్నారు. వర్షాలు తగ్గినందున పాడైన రోడ్లను బాగు చేయాలని అదేశించారని అన్నారు. అందులో భాగంగా నాగారం నుండి నందు పల్లి వరకు 30 లక్షలు,నందుపల్లి నుండి తండా వరకు28 లక్షల తో పడమటి తాండాలో 34 లక్షలు,రీ బీటీ పనులకు మంజూరు అయ్యాయని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద 12 అంశాలాలలో మొదటి విడతలో 3500 కోట్లతో 9 వేల పాఠశాలలో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 464 పాఠశాలల్లో మొదటి విడతలో 200 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేపడుతున్నామని అన్నారు.

మహేశ్వరం మండలంలో 19 పాఠశాలలు ఈ పథకం కింద  5 కోట్ల 19 లక్షలు వెచ్చించి పనులు చేపడుతున్నట్లు,ఇందులో కోటి రూపాయలు నాగారం పాఠశాలకే ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కందుకూరు మండలంలో 2 కోట్ల 18 లక్షలతో 20 పాఠశాలాలు,బాలాపూర్ లో 3 కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై1లక్ష,25 వేలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: