కార్తీక పౌర్ణమి సందర్భంగా.....

కిట కిట లాడిన.. కొత్తురు క్షేత్రం

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం‌ మండల పరిధిలోని కొత్తూరు క్షేత్రంలో  సామూహిక సంతాన లక్ష్మి పూజ కార్యక్రమాన్ని అర్చకులు నాగ పుల్లయ్య శర్మ, వీరయ్య శర్మ  ఆధ్వర్యంలో వడిబీయ్యం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు 300 నుండి 500 మంది వరకు హాజరవుతారు అని అంచనా వేశారు. అనూహ్యంగా 3000 పైగా కొత్తూరు శ్రీవల్లి సుబ్రమణ్య స్వామి వారినీ దర్శించుకోవడానికి భక్తులు రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందికి గురి అయ్యారు. స్వామివారికి దర్శన టోకెన్ లు పంపిణీ చేయడం ఆలస్యం కావడంతో తోపులాట జరిగింది. భక్తులను నియంత్రణ చేయలేక ఆలయ సిబ్బంది చేతులెత్తేయడంతో నందివర్గం ఎస్ఐ  సుధాకర్ రెడ్డి తన సహచర పోలీస్ సిబ్బందితో కలిసి భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా దైవ దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: