నీటి సరఫరా పైపుల లీకేజీకి మరమ్మత్తులు

జానో జాగో వెబ్ న్యూస్ కథనానికి అధికార్ల స్పందన

సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు ..బిలకలగూడూరు గ్రామపంచాయతీ సెక్రెటరీ బాలకృష్ణ అభినందన

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

వాస్తవ కథనాలను ప్రజలకు చేరువేయడమే కాదు నిరంతరం ప్రజా సమస్యలపై డేగా కన్నువేసి అధికార్ల దృష్టికి తీసుకెళ్తున్న జానో జాగో వెబ్ న్యూస్ కథనానికి తాజాగా మరో స్పందన లభించింది. అంతే కాదు సమస్యను అధికార్లు పరిష్కరించేలా చేయడమే కాదు మంచి వార్తలు తీసుకొస్తున్నందుకు జానో జాగో వెబ్ న్యూస్ కు అభినందిస్తున్నామని అధికార్ల ప్రశంసలు సైతం పొందింది. ఇదిలావుంటే ఈ నెల 15 తేదీన జానో జాగో వెబ్ న్యూస్ లో ‘‘బిలకలగూడూరు గ్రామంలో పైపు లీకేజీలు.... మురికినీరు తో కాలుష్యం’’ అన్న టైటిల్ తో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.


వివరాలలోకి వెళ్లితే...నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని బిలకలగూడూరు గ్రామంలో జానో జాగో వెబ్ న్యూస్ లో 15-11-22 వ తేదీన ప్రచురితమైన "పైపు లీకేజీలు".... "మురికినీటితో మంచినీరు కలుషితం" అనే వార్తకు స్పందించిన బిలకలగూడూరు గ్రామపంచాయతీ సెక్రెటరీ బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిలకల గూడూరు గ్రామంలో నీటి సరఫరా పైపులు లీకేజీలు ఉన్నాయని, వాటన్నింటినీ గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి మరమ్మతులు చేయడం జరిగిందని, గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, గ్రామంలోని సమస్యలు తెలిపిన వెంటనే గ్రామపంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యను గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన జానో జాగో వెబ్ న్యూస్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: