"నాడు - నేడు" పనులు వేగవంతం చేయాలి...
గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ, "నాడు - నేడు" పాఠశాలలలో పనులను వేగవంతం చేయాలని, అశ్రద్ధ వహిస్తే ఉన్నతాధికారులు తీసుకునే చర్యలకు ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు, "నాడు - నేడు" పనులను అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ హుస్సేన్ ఉస్మాన్ పర్యవేక్షిస్తానని, అలాగే విద్యా శాఖ అడ్మినిస్ట్రేషన్ లో వారి భాగస్వామ్యం ఉంటుందని,
మండలంలో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ వారికి సహకరించాలని సూచించారు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ హుస్సేన్ ఉస్మాన్ మాట్లాడుతూ "నాడు - నేడు" పనులలో తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించాలని, అందరం కలిసి మండలంలోని పాఠశాలలన్నింటిని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.ఈ సమావేశంలో గడివేముల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సి అర్ పి లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Home
Unlabelled
"నాడు - నేడు" పనులు వేగవంతం చేయాలి... గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: