ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

ఘనంగా భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని రావుస్ కళాశాల యందు "మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి" సందర్భంగా ఆల్ మేవా ఆధ్వర్యంలో "స్వాతంత్ర ఉద్యమం లో - భారతదేశ ఉన్నత విద్యాభివృద్ధి" లో మౌలానా అబ్దుల్ కలాం  గారి పాత్ర అను అంశం మీద వ్యాసరచన పోటీలను నిర్వహించి గ్యాస్ రచన పోటీలలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్  విద్యార్థులకు, ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ  బహుమతులను నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మబున్నీ  గారి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి విద్యామంత్రిగా ఉంటూ విద్యారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. విద్యార్థినీ, విద్యార్థులు చదువుల విషయంలో మౌలానా గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని,తల్లిదండ్రులు మీపై ఎంతో నమ్మకంతో చదివిస్తున్నారని తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయవద్దని తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ మేవ గౌరవ అధ్యక్షులు అబులైస్ మాట్లాడుతూ


లౌకిక భావనలతో తమ సంస్థ ఏర్పడిందని, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న విషయాలను,భారత దేశ ఉన్నత విద్యకు చేసిన కృషిని  వివరించారు. ప్రధాన కార్యదర్శి సలీం మాట్లాడుతూ దేశానికి ముఖ్యంగా విద్యారంగానికి ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మౌలానా అబ్దుల్ కలాం అని చెప్పారు దేశంలో హిందూ ముస్లిం ఐక్యత కోసం పత్రికను నడిపి ఐక్యతకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుస్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య గారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, పరిపాలన దక్షుడైన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అడుగుజాడలలో విద్యార్థిని,విద్యార్థులు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తమ కళాశాలలో  నిర్వహించినందుకు ఆల్మేవా సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్మేవ కార్యకర్తలు  మహమ్మద్ రఫీ, జమ, ఖాసిం, సైఫుల్లా మునీర్, అమిరుద్దీన్ మరియు రాహుస్ కళాశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: