బాలల దినోత్సవం, సైన్స్ దినోత్సవం సందర్భంగా...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో 11వ తేదీ మధ్యాహ్నం 03:00 గంటలకు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ సూచన మేరకు "బాలల దినోత్సవం" మరియు "సైన్సు దినోత్సవం" సందర్భంగా "శాంతి మరియు అభివృద్ధి" అనే అంశంపై ఇంగ్లీష్ , తెలుగు మరియు ఉర్దూ భాషలలో వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, నంద్యాల జిల్లా లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుండి నలుగురు లేదా పదిమంది విద్యార్థులకు ( 8 వ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు) అవకాశం కల్పిస్తున్నామని, ఈ వ్యాసరచన పోటీలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులను పంపవలెనని కోరారు, వ్యాసరచన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థిని,విద్యార్థులకు నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్, నంద్యాల డి ఈ ఓ చేతుల మీదుగా ప్రశంశా పత్రాలు అందజేయ బడతాయని, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారికి సంబంధించిన ప్యాడ్ (అట్ట), పెన్నులు వారే తెచ్చుకోవాలని, వ్యాసరచన పోటీల్లో పాల్గొనే విద్యార్థిని, విద్యార్థులు 15 నిమిషాలు ముందుగా రావాలని , విద్యార్థిని,విద్యార్థులతో పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను  పంపాలని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: