చేతుల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

ఘనంగా అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల పరిధిలో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినం (గ్లోబల్ హ్యాండ్ వాష్ డే) పురస్కరించుకొని,  మండలంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు, స్థానిక మెయిన్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ చేతుల పరిశుభ్రత అనేది ఆరోగ్యానికి మూల కారణమని, ప్రతిరోజు భోజనం చేసేముందు మరియు మలమూత్ర విసర్జన అనంతరము చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు, వైద్య సిబ్బంది భారతి మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కుంటే నులిపురుగులు కడుపులో చేరకుండా ఉంటాయని, చేతులను శుభ్రం చేసుకోవాలని, ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చేసి చూపించారు,


కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలు అంజుమ్ అరా మాట్లాడుతూ పరిశుభ్రత అనేది మొదటి ప్రాధాన్యత కలిగిన అంశమని, విద్యార్థులు ప్రతిరోజు పరిశుభ్రంగా పాఠశాలకు రావాలని, ఎంఈఓ మరియు భారతి  సూచించిన విధంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశాబి, మహేశ్వరమ్మ ,ఎంఈఓ కార్యాలయ సిబ్బంది హిదాయతుల్లా, విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: