బాల కార్మిక పాఠశాలలో ఎంఇఓ పాత్రపై విచారణ చేపట్టాలి
బహుజన టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా లో బాలకార్మిక పాఠశాలలు నెలకొల్పేందుకు, నిర్వాహకులకు తప్పుడు మార్గాల్లో అనుమతులు మంజూరు, ప్రభుత్వ నిధులు స్వాహా చేసేందుకు నంద్యాల ఎంఇఓ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయని బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
విద్యాశాఖాధికారులు తక్షణమే స్పందించి తప్పులపై తప్పులు చేస్తూ, బాల కార్మిక పాఠశాలలకు సంభందించి బోగస్ రికార్డ్ నెలకొల్పుటలో సహకరించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన ఎంఇఓ పాత్రపై విచారణ చేపట్టి, వాస్తవాలపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.
Home
Unlabelled
బాల కార్మిక పాఠశాలలో ఎంఇఓ పాత్రపై విచారణ చేపట్టాలి... బహుజన టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: