కేళరలో బురఖా ధరించిన ఆలయ పూజారి


కేరళలో ఓ వింత ఘటన చోటు చేసుకొంది. ఓ ఆలయ పూజారి బురఖా ధరించడం కలకలం రేపింది. కోయిలాండి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఆ యువ పూజారి పేరు జిష్ణు నంబూద్రి. వయసు 28 సంవత్సరాలు. మెయ్యాపూర్ ప్రాంతంలోని ఓ ఆలయంలో జిష్ణు నంబూద్రి పూజారిగా వ్యవహరిస్తున్నాడు. అక్టోబరు 7న కోయిలాండీ జంక్షన్ లో బురఖా ధరించి తిరుగుతున్న అతడిని ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బురఖా ఎందుకు ధరించావని పోలీసులు ప్రశ్నించగా, తనకు చికెన్ పాక్స్ వ్యాధి సోకిందని, అందుకే బురఖా ధరించి తిరుగుతున్నానని ఆ పూజారి బదులిచ్చాడు. అయితే, అతడి శరీరంపై చికెన్ పాక్స్ వ్యాధి చిహ్నాలు ఏవీ కనిపించలేదని ప్రాథమిక పరిశీలన అనంతరం పోలీసులు వెల్లడించారు. ఇదిలావుంటే ఆ పూజారిపై ఎలాంటి నేరారోపణలు లేవని పోలీసులు తెలిపారు. అతడి బంధువులు వచ్చి తమవాడే అని చెప్పడంతో వివరాలు నమోదు చేసుకుని విడిచిపెట్టామని పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: