పాణ్యం మండల కేంద్రంలోని

కేజీబీవి...ఏపీ మోడల్ స్కూళ్లకు రహదారి ఎక్కడా..?

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

పాణ్యం మండల కేంద్రంలో  ఏపీ మోడల్ స్కూల్ కేజీబీవీ1 స్కూల్ హాస్టల్ లు ఏర్పాటు చేసి  దాదాపుగా ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతున్నా  ఆ యొక్క స్కూల్స్ కట్టడానికి అధికారులు పర్మిషన్ ఇచ్చి బిల్డింగ్ నిర్మించి పూర్తి అయినాక వాటికీ కాంపౌండ్ వాల్, సీసీ రోడ్డు  ఎందుకు వేయకుండా  వెళ్లిపోయారు అని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.ఎన్. రాజునాయుడు జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్, ఏఐఎఫ్ బీ వనం  వెంకటాద్రి మాట్లాడుతూ రహదారి లేక  విద్యార్థులు గ్రామస్తుల ఇళ్ల మధ్యలో నుండి గత 6 సంవత్సరాల నుండి ఇప్పటివరకు  స్కూళ్లకు దాదాపుగా 2000 మంది విద్యార్థులు అలాగే 60 మంది టీచర్లు  దాదాపుగా 1/2. కీ.ఎం. దూరo ఉన్నటువంటి స్కూల్ కంకర రాళ్లు మద్యం నడుచుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పటికీ వరకూ ఉన్నదని, వర్షాకాలం వస్తే వాటి మధ్య బురదలో, నీటిలో  విద్యార్థులు నడుచుకుంటూ వెళ్ళాలని,


గత 3 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ విద్యార్తి సంఘాలు  ధర్నాలు  చేసి  గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీస్ ల వరకు విద్యార్థులతో  ఎంఆర్ ఓ మల్లికార్జునకి వినతిపత్రం అందచేశారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు, ఈనెల  17వ తేదిన నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని, భవిష్యత్తులో ఏపీ మోడల్ స్కూల్ కు అలాగే కస్తూరిబా స్కూల్ కు ఉన్నతాధికారులు రావడానికి కూడా ఇబ్బందిగా ఉందని ఉన్నతాధికారులను విద్యార్థులు ఆడుకుంటున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో వనం  వెంకటాద్రి, శ్రీనివాసరావు ,రియాజ్,  బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: