ఓర్వకల్లు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల..... మైదాన భూమి కబ్జా
ప్రభుత్వ కళాశాల భూమిని ఇంటి స్థలాలుగా మార్చుకున్న వైనం
ప్రభుత్వ విద్యా సంస్థల ఆటస్థలలాకు...... రక్షణ ఎక్కడ...?
మైదాన భూములను కాపాడండి...సిపిఐ (ఎంఎల్), న్యూడెమోక్రసీ (పిడిఎస్ యు), రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్)
(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో ఉన్న అర్ సి ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంను భూకబ్జాదారుల నుండి కాపాడాలని సిపిఐ (ఎంఎల్), న్యూడెమోక్రసీ (పిడిఎస్ యు), రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండల డిప్యూటీ తహశీల్దార్ సతిష్ కూమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రమేష్.సిపిఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ.రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్ర నాథ్ పిడిఎఫ్ యు భాస్కర్ లు మాట్లాడుతూ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న భూమిని గతంలో ఎమ్మార్వో గా పని చేసిన కొంతమంది అధికారులు లబ్ధిదారులకు పట్టాలు ఆ సర్వే నెంబర్లలో మంజూరు చేయడం జరిగిందని,ఎవరైతే ఆ సర్వే నెంబర్ లో నిజమైన లబ్దిదారులు ఉన్నారో గుర్తించి అధికారులు ఎంక్వైరీ చేసి మరోచోట స్థలం ఇవ్వాలి అని అన్నారు. లేని పక్షంలో అక్కడున్నటువంటి లబ్ధిదారులను సమీకరించి ఉద్యమాలను ఉదృతం చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహులు.విఘ్ణు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఓర్వకల్లు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల..... మైదాన భూమి కబ్జా.మైదాన భూములను కాపాడండి...సిపిఐ (ఎంఎల్), న్యూడెమోక్రసీ (పిడిఎస్ యు), రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: