త్వరలోనే డిజిటల్ రూపాయి: ఆర్బీఐ
త్వరలోనే డిజిటల్ రూపాయిని విడుదల చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వెల్లడించింది. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానంలో భాగంగా ఆర్బీఐ శుక్రవారం ఈ ప్రకటనను విడుదల చేసింది. డిజిటల్ రూపాయిపై అవగాహన పెంచడంతో పాటుగా సీబీడీసీ గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
నిర్దిష్ట వినియోగం కోసం త్వరలోనే డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ సదరు ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఈ డిజిటల్ రూపాయిని పరిమిత స్థాయి వినియోగానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరెన్సీకి డిజిటల్ రూపాయి అదనపు వెసులుబాటు మాత్రమేనని కూడా ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఇతర డిజిటల్ కరెన్సీ మాదిరే అన్నీ లావాదేవీ ప్రయోజనాలు డిజిటల్ రూపాయికి కూడా ఉంటాయని వివరించింది.
Home
Unlabelled
త్వరలోనే డిజిటల్ రూపాయి: ఆర్బీఐ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: