వ్యాధులపై ప్రచారానికి ఉన్న  శ్రద్ద...వ్యాధుల నివారణపై ఏదీ

పురానాపుల్ గొల్ల కిటికీ ప్రధాన ఎక్స్ రోడ్ వద్ద...

రోడ్డుపై పేరుకుపోతున్న చెత్త

ఫిర్యాదు చేసిన పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారులు

చెత్తచెదారంతో పెరుగుతున్న వ్యాధులు.. యాక్సిడెంట్లకు కారణమవుతున్న వైనం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

జిహెచ్ఎంసి అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి ఉదాహరణగా పురానాపుల్ గొల్ల కిటికీ ప్రధాన ఎక్స్ రోడ్ వద్ద నెలకొన్న దుస్థితిని చూపించవచ్చు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచన చేస్తున్న, జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వ్యాధులను స్వాగతించే దుస్థితిని పురానాపుల్ గొల్ల కిటికీ ప్రధాన ఎక్స్ రోడ్ పరిసరవాసులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..పురానాపుల్ గొల్ల కిటికీ ప్రధాన ఎక్స్ రోడ్ వద్ద చెత్తచెదారం పేరుకుపోయింది. ఈ చెత్త చెదారం అక్కడున్న ప్రధాన రహదారులు సైతం ఆక్రమించేసింది. దీంతో రోడ్డున పోయే వాహనదారులు ఈ చెత్తలో ఇరుక్కున్న కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు.


ద్విచక్ర వాహనాలు చెత్తలో ఇరుక్కోవడం, బండి చక్రాలు జారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ చెత్తచెదారంలో నీరు ప్రవేశించడం, దీంతో అక్కడ దుర్వాసన పెట్రేగి దోమలు పెరిగిపోవడం, తద్వారా పరిసరవాసులు వ్యాధులకు గురవుతున్నారు. దీనిపై పరిసరవాసులు పలుమార్లు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అదేమి తమకు పట్టనట్లుగా జిహెచ్ఎంసి అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యను జిహెచ్ఎంసి అధికారులు కనీసం గా పట్టించుకోవడంలేదని, సమస్య పరిష్కారం కోసం కన్నెత్తి చూడటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు ఈ సమస్యను పట్టించుకోని చెత్త చెదారం తొలగించి, తమను కాపాడాలని పురానాపుల్ గొల్ల కిటికీ ప్రధాన ఎక్స్ రోడ్ పరిసరవాసులు కోరుతున్నారు. ఈ విషయాన్ని జిహెచ్ఎంసి అధికారులు పెడచెవిన పెడితే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: