న‌య‌న‌తార‌ దంపతులకు షాకిచ్చిన తమిళనాడు సర్కార్


తమిళనాడలో తాజాగా నయనతార దంపతుల అంశం చర్చాంశనీయంగా మారింది. ప్ర‌ముఖ హీరోయిన్ న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ దంప‌తుల‌కు త‌మిళ‌నాడు స‌ర్కారు గురువారం షాకిచ్చింది. న‌య‌న్‌, విఘ్నేశ్ దంప‌తులు ఇటీవ‌లే క‌వ‌ల‌ల‌కు త‌ల్లిదండ్రులైన సంగ‌తి తెలిసిందే. అయితే పెళ్లి జ‌రిగిన 6 నెల‌లు కాకుండానే న‌య‌న్ క‌వ‌ల పిల్ల‌ల‌కు ఎలా జ‌న్మనిచ్చార‌న్న వాద‌న‌లు రేకెత్త‌గా... స‌రోగ‌సీ (అద్దె గ‌ర్భం) ద్వారా న‌య‌న్ దంప‌తులు పిల్ల‌ల‌ను క‌న్నార‌న్న వాద‌న‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై న‌య‌న్ ఇప్ప‌టిదాకా స్పందించ‌నే లేదు. 

అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న ర‌చ్చ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ స్పందించారు. ఈ విష‌యంపై న‌య‌న్ దంప‌తులు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ మాట‌ల‌తోనే స‌రిపెట్ట‌ని త‌మిళ‌నాడు స‌ర్కారు తాజాగా న‌య‌న్ స‌రోగ‌సీ వివాదంపై ఏకంగా విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. న‌య‌న్ స‌రోగ‌సీపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి ప్ర‌భుత్వానికి నివేదిక అందించాల‌ని ఈ క‌మిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: