పసిడితో మెరిసిన తెలంగాణ షూటర్ ఈషా సింగ్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల పరుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణకు చెందిన మహిళా షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఈషా సింగ్ తెలంగాణ ఖాతాలో తొలి పతకాన్ని చేర్చింది. వెరసి జాతీయ క్రీడల్లో రెండు తెలుగు రాష్ట్రాల ఖాతాల్లో రెండు పసిడి పతకాలు ఒకే రోజు చేరాయి. అంతేకాకుండా ఈ రెండు పతకాలను సాధించింది మహిళా క్రీడాకారులే కావడం గమనార్హం.
Home
Unlabelled
పసిడితో మెరిసిన తెలంగాణ షూటర్ ఈషా సింగ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: