ఉపాధ్యాయులకు.. టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ
(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులకు టి.ఎ.ఆర్.ఎల్ పై శిక్షణ ప్రారంభించినట్లు ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు. టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణను మండలంలోని పాఠశాలల్లో 3,4,5 వ తరగతులు బోధించే ఉపాధ్యాయులకు అందరికీ ఉంటుందని, ఈ శిక్షణ రెండు విడతల్లో ఏర్పాటు చేసినట్లు, మొదటి విడుద17-10-22 నుండి,20-10_22 వరకు రెండవ విడత 21-10-22 నుండి26-10-22 వ తేదీలలో ఉంటుందని, ఒక్కో విడత నాలుగు రోజులు ఉంటుందని, ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ హాజరవుతారని ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు,
ఈ శిక్షణలో స్థాయికి తగ్గ బోధన, సులభ పద్ధతిలో బోధన, ఆటపాటలతో బోధన, బోధనోపకరణాల తయారీ తదితర అంశాలలో శిక్షణ ఉంటుందని ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఎంఈఓ రామకృష్ణుడు, రిసోర్స్ పర్సన్ మహబూబ్ బాషా, నాగలక్ష్మి, రాజేష్, నాగరాజు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఉపాధ్యాయులకు..... టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: