శ్రీరాముడికి హ‌నుమంతుడిలా... రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి


తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌భ్యుడు, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బ‌రామిరెడ్డి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భార‌త్ జోడో యాత్ర త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ప్ర‌వేశించ‌నుంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో యాత్ర‌ను దిగ్విజ‌యం చేసే దిశ‌గా టీపీసీసీ మంగ‌ళ‌వారం గాంధీ భ‌వ‌న్ వేదిక‌గా ఓ స‌మావేశాన్ని నిర్వహించింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన సంద‌ర్భంగా మాట్లాడిన సుబ్బ‌రామిరెడ్డి... రేవంత్ రెడ్డి సామ‌ర్థ్యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


రాహుల్ గాంధీకి కుడి భుజంలా రేవంత్ రెడ్డి ప‌నిచేస్తున్నార‌ని సుబ్బ‌రామిరెడ్డి అన్నారు. శ్రీరాముడికి హ‌నుమంతుడు ఎలాగో... రాహ‌ల్ గాంధీకి రేవంత్ రెడ్డి కూడా అంతేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంత‌టితో ఆగ‌ని సుబ్బ‌రామిరెడ్ది... రేవంత్ రెడ్డి చూసి ర‌మ్మంటే కాల్చి వ‌చ్చే ర‌క‌మ‌ని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌ని ఆయ‌న అన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: