ఎలుక వారే దొంగలించివుంటారు...తెచ్చిపెట్టండి


రాజస్థాన్  పోలీసులకు ఓ విచిత్రమైనా కేసు ఆందోళనకు గురిచేసింది. విలువైన వస్తువులు పోయాయనో.. వాహనాలు ఎత్తుకెళ్లారనో.. ఇంట్లోకి దూరి నగదు, బంగారాన్ని దొంగలు దోచుకుపోయారనో పోలీసులకు ఫిర్యాదులు అందడం సహజం. కానీ, దీనికి విరుద్దంగా తన ఎలుకను ఎవరో ఎత్తుకెళ్లిపోయారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. ‘నేను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఎలుకను ఎవరో ఎత్తుకెళ్లారు.. సార్’ అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అంతేకాదు, తన సోదరుడి కుమారులపైనే అనుమానం వ్యక్తం చేశాడు. విచిత్రమైన ఈ సంఘటన రాజస్థాన్‌‌లో చోటుచేసుకుంది.

బాంసవాఢా జిల్లా సజ్జన్‌గడ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు ఎలుక కనిపించడం లేదంటూ ఆదివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఆశ్చర్య పోయిన పోలీసులు.. అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, అతడు మాత్రం వినిపించుకోలేదు. తన పెంపుడు ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని, సెప్టెంబరు 28న దానిని ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. అయితే, తన సోదరుడి ముగ్గురు కుమారులపైనే తనకు అనుమానం ఉందని తెలిపాడు. పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అతడు మాత్రం ససేమిరా అన్నాడు. చివరకు చేసేది లేక ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తి సోదరుడి ముగ్గురి కుమారుల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే, ఇటువంటి ఫిర్యాదు అందడం ఇదే తొలిసారని పోలీసులు పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: