మాస్టర్ ప్లాన్ లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు...చెక్కులు పంపిణీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రోడ్డు విస్తరణ మాస్టర్ ప్లాన్ లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సబ్లీగంజ్ ప్రాంతంలో చెక్కుల పంపిణీ చేపట్టారు. వజీర్ అలీ మజ్జీద్ ప్రాంతం నుంచి బారగల్లీ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా సాగిన మాస్టర్ ప్లాన్ లో పలువురు తమ ఇళ్లను, వాటిలోని కొంత సముదాయాన్ని కోల్పోయారు. అలా కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం కింద చెక్కులు అందజేశారు. పురానా పుల్ కార్పోరేటర్ రాజమౌళి, డిప్యూటీ సీటీ ప్లానర్ మాజిద్ చేతల మీదగా ఈ చెక్కుల పంపిణీ  కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆపీసర్ సుకన్య, కె.శ్రీనివాస్, నరేష్, మునవార్ అలీ, ఎంఐఎం నాయకులు ప్రమోద్ కుమార్ జైన్, శ్రీనవాస్, హీబీబ్ ఖురేషి, జహంగీర్, మహమ్మద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: