దేవి శ్రీ ప్రసాద్ తోనే కాదు...నాకు ఎవరితోనూ రిలేషిన్ షిప్ లేదు


దేవి శ్రీ ప్రసాద్ తోనే కాదు... తనకు ఎవరితోనూ రిలేషిన్ షిప్ లేదని టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన అచ్చ తెలుగు నటి పూజిత పొన్నాడ స్పష్టత నిచ్చింది. ఆమె తనపై వస్తున్న కథనాల పట్ల స్పందించింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో తన పెళ్లి సీక్రెట్ గా జరిగిందంటూ వస్తున్న కథనాలను ఆమె ఖండించింది. దేవి శ్రీ ప్రసాద్ తోనే కాదు... తనకు ఎవరితోనూ రిలేషిన్ షిప్ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి కథనాలు ఎలా పుట్టిస్తారో అర్థం కాదని పూజిత పొన్నాడ వాపోయింది. దేవి శ్రీ ప్రసాద్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దంటూ హితవు పలికింది. 

గతంలో రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించిన పూజిత ప్రస్తుతం 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఒంటరినే అని, సోషల్ మీడియాలో నెగెటివ్ వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయని వెల్లడించింది. వైజాగ్ కు చెందిన పూజిత పొన్నాడ 'ఊపిరి' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: