భారీ వాహనాలను అనుమతించకండి
గడివేముల గ్రామ ప్రజలు విన్నపం
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
గడివేముల గ్రామంలో అనునిత్యం జిందాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. వివరాల్లోకి వెళితే గడివేముల గ్రామం మీదుగా నంద్యాలకు , నందికొట్కూరు మరియు కర్నూలు కు ఈ రహదారిలో అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు బస్సులల్లో, ద్విచక్ర వాహనాలపై, అనునిత్యం గడివేముల గ్రామం మీదుగా వెళుతుంటారు, అయితే జిందాల్ ఫ్యాక్టరీ భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కావడం వల్ల వాహనదారులు, అధికారులు గంటల కొద్ది వేచి ఉండవలసిన పరిస్థితి కనిపిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం భారీ వాహనాల రాకలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, గడివేముల రహదారిలో వాహనాల కింద పడి కొంతమంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయని,అలా ప్రవేశించిన వాహనాలకు గతంలో పనిచేసిన గడివేముల ఎస్సై హుస్సేన్ భాష భారీ జరిమానాలు విధించి జిందాల్ వాహనాలు రాకుండా అరికట్టారని,
కానీ ఇప్పుడు ఏదేచ్ఛగా పగలనక రాత్రి అనక తిరుగుతున్న జిందల్ భారీ వాహనాల రాకపోకలను అరికట్టడం లేదని గడివేముల గ్రామం లోనికి జిందాల్ ఫ్యాక్టరీ సిమెంటుకు సంబంధించిన భారీ వాహనాలు వస్తున్నాయనీ, భారీ వాహనాలు రావడం వల్ల వాహనదారులు ప్రయాణం చేసే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, రహదారిలో ప్రయాణం చేయాలంటే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని, భారీ వాహనాల కిందపడి చాలా మంది వాహనదారులకు గాయాలు అయ్యారని,ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందనీ. జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ భారీ వాహనాలకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే తిరగడానికి జిందాల్ ఫ్యాక్టరీ ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం తో సంప్రదించి భారీ వాహనాలు తిరగకుండా అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
Home
Unlabelled
భారీ వాహనాలను అనుమతించకండి,,, గడివేముల గ్రామ ప్రజలు విన్నపం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: