సల్మాన్ రష్దీ...ఇపుడు  మాట్లాడుతున్నారటా

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కాస్త కోలుకొన్నారని, ఆయన మాట్లాడుతున్నారని వైద్యులు చెప్పారు. ఇదిలావుంటే న్యూయార్క్ లో కత్తిపోట్లకు గురైనసల్మాన్ రష్దీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు తాజాగా వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మాట్లాడగలుగుతున్నారని మరో రచయిత ఆతిష్ తసీర్ వెల్లడించారు. ఆసుపత్రి బెడ్ పై ఉండి కూడా జోక్ చేశారని తెలిపారు. ఆతిష్ తసీర్ వెల్లడించిన అంశాలను సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ వైలీ నిర్ధారించారు. 

సల్మాన్ రష్దీ న్యూయార్క్ లోని చౌటాక్వా స్వచ్ఛంద విద్యాసంస్థలో ఓ సదస్సులో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా, హాదీ మతార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం తెలిసిందే. మెడ, ఉదరంలో కత్తిపోట్ల కారణంగా రష్దీ వేదికపైనే కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఓ కన్ను కోల్పోయే ముప్పు ఎదుర్కొంటున్నారని, కాలేయం బాగా దెబ్బతిన్నదని నిన్న వార్తలు వచ్చాయి.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: