డబ్బాపాలు వద్దు తల్లిపాలు ముద్దు..
గడివేముల వైద్యాధికారిని డాక్టర్ సృజన
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని బూదునూరు గ్రామంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గడివేముల మండల వైద్యాధికారిని డాక్టర్ సృజన గారు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ సృజన మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లి ముర్రిపాలు ఎంతో శ్రేష్ఠమైనవి, శిశువు ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయని, శిశువుకు డబ్బా పాలు వద్దని తల్లిపాలే ముద్దని, శిశువు జన్మించినప్పటి నుండి తల్లి పాలు ఇవ్వడం ద్వారా శిశువుకు అన్ని పోషకాహారాలు అందుతాయని, గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి డాక్టర్ గారి సలహాలు తీసుకోవాలని బూజులూరు గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో JSW సిమెంట్ ఫ్యాక్టరీ సిపిఎస్ ఆర్ టీం, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: