మా భూములను ఆన్లైన్లో ఎక్కించండి...
ఎల్.కే.తండా గ్రామ ప్రజల విన్నపం
(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా, గడివేముల మండలం పరిధిలోని ఎల్.కే.తండా ప్రజలు సుమారు 140 మంది షెడ్యూలు తెగలు(ST) కు చెందిన తండా ప్రజలు నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీద్ జిలాని సామూన్ ని కలిసి ఎల్.కే.తండా ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. వివరాల్లోకి వెళితే ఎల్.కే.తండా ప్రజలు సుమారు 40 సంవత్సరముల నుండి చిందుకూరు, చనకపల్లి, గని గ్రామ పొలాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నామని, సాగు చేసిన భూమిలో మామిడి చెట్లు నాటి జీవనం కొనసాగిస్తున్నామని, సాగు చేసుకుంటున్న భూమిని ఆన్లైన్లో ఎక్కించమని గడివేముల మండల రెవిన్యూ అధికారులకు మొరపెట్టుకొని, చెప్పులు అరిగేలా తిరిగామని, గడివేముల మండల రెవెన్యూ అధికారులు మాత్రం ఇది మా పరిధిలో లేదు అంటూ పొంతనలేని సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారని, మేము సాగు చేసుకుంటున్న భూమి గడివేముల మండలంలోని వ్యక్తుల పేర్ల మీద,ఇతర మండలాల్లోని వ్యక్తుల పేర్ల మీద, అంతేకాకుండా ఇతర జిల్లాల్లోని వ్యక్తుల పేర్ల మీద ఆన్లైన్లో నమోదు అయినట్లుగా చూపిస్తున్నాయని, ఆన్లైన్లో ఉన్న వ్యక్తులకు వారి భూమి సర్వే నెంబర్లు గాని, ఆ భూమి ఎక్కడ ఉందో, ఎక్కడున్నాయో కూడా తెలియదని, కానీ వారు పాసు పుస్తకాలు చూపి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని ఎల్.కే.తండాప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపై 40 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న మాకు మా భూమిని ఆన్లైన్లో ఎక్కించి మా పేరు మీద పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ కి ఎల్.కే.తండా ప్రజలు విన్నవించారు. అనంతరం డిఆర్ఓ పుల్లయ్య గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
Home
Unlabelled
మా భూములను ఆన్లైన్లో ఎక్కించండి... ఎల్.కే.తండా గ్రామ ప్రజల విన్నపం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: