ఈడీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుంది: మంత్రి జగదీశ్ రెడ్డి

ఈడీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుందని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారంనాడు నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఉద్ఘాటించారు. మునుగోడులో బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని ఎద్దేవా చేశారు. ఈడీ పేరు చెప్పి భయాందోళనలకు గురిచేయాలనుకుంటున్నారని, ఈడీ బోడీలకు భయపడే ప్రసక్తేలేదని అన్నారు. కేసీఆర్ ఎవరికీ లొంగే రకం కాదని అన్నారు. 

బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో వామపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం, సీపీఐ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: