గడివేములలో ఘనంగా...
ఆజాదీ కా అమృత్ వజ్రోత్సవ వేడుకలు
గడిమేముల లోని జామియా మసీదులో ఆజాదికా అమృత్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించిన ముస్లిం సోదరులు
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా,గడివేముల మండల పరిధిలోని స్థానిక జామియ మసీదు, బీసీ కాలనీలోని మసీదు మదరసా విద్యార్థులు నమాజు ప్రార్థనలు ముగించిన అనంతరం ముస్లిం సోదరులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా "ఆజాదీ కా అమృత్"వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గడిమేములలోని బీసీ కాలనీ నందు ఉన్న మదరసాలో...
ఆజాదికా అమృత్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించిన విద్యార్థులు
ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హిందూ,ముస్లిం,క్రిస్టియన్లు, అందరం కలిసి ఐకమత్యంతో జెండా పండుగను చేసుకోవడం ఆనందంగా ఉందని, "భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలు చేశారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆజాదికా అమృత్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించిన విద్యార్థినిలుకస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలు "ఆజాదీ కా అమృత్"వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జైహింద్, నినాదాలతో స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు.
Post A Comment:
0 comments: