ప్రియుడు దూరం కాకూడదని... హెచ్ ఐవీ బాధితురాలిగా మారిన ప్రియురాలు


తాను ప్రేమించిన వ్యక్తి బాగుండాలని కోరుకొనేది ప్రేమ. తనకోసం ప్రియురాలిని బలిచ్చేది స్వార్థం. ప్రేమ అంటే ఏమిటో తెలియని ఓ ప్రేమ జంట వింత పని చేసింది. ప్రేమికుడు హెచ్ఐవీ బాధితుడని తెలిసినా అతడితోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్న ప్రేమికురాలు.. అతడి రక్తాన్ని ఎక్కించుకుని తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారింది. అసోంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. కామరూప్ జిల్లాలోని సువల్‌కచికి చెందిన 19 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పొరుగూరికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా మొగ్గతొడిగి ప్రేమగా మారింది. ఆపై ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. 

ఈ క్రమంలో ఒక రోజు తాను ప్రేమిస్తున్న యువకుడు హెచ్ఐవీ బాధితుడని యువతికి తెలిసింది. అయినప్పటికీ అతడితోనే జీవితాన్ని పంచుకోవాలని భావించిన ఆమె.. మూడుసార్లు అతడితో కలిసి ఊరొదిలి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెతికి తీసుకొచ్చారు. దీంతో తాము పెళ్లి చేసుకున్నా తమను విడదీస్తారని భయపడింది. 

ఇకపై అలా కాకూడదంటే తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ రోజు అతడి రక్తాన్ని ఆమె తన శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశారు. యువతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువతి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: