తెలంగాణలో క్రమంగా పేరుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా పదుల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అదికూడా హైదరాబాద్ లోనే అధికంగా ఉంటున్నాయి. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 28,899 కరోనా పరీక్షలు నిర్వహించగా, 440 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 195 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో 652 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,28,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,21,249 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,551 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మరణించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: