కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేసిన...

గడివేముల జడ్పిటిసి ఆర్.బి. చంద్రశేఖర్ రెడ్డి

 (జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండలానికి కొత్తగా 38 మందికి పింఛన్ల మంజూరయ్యాయని వాటిలో సచివాలయం 1  లో కొత్తగా 17 పింఛన్లు మంజూరయ్యాయని, చివాలయం 2 లో  కొత్తగా 26 పింఛన్లు మంజూరు అయ్యాయని పంచాయతీ సెక్రటరీ తారకేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ తెలిపారు. కొత్తగా మంజూరైన 38 మంది పింఛను లబ్ధిదారులకు  గడివేముల జడ్పీటీసీ ఆర్.బీ.చంద్రశేఖర రెడ్డి చేతులమీదుగా పింఛన్లు అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడివేముల జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మ్మోహన్ రెడ్డి ఆడపడుచులకు ఎప్పుడూ అండగా ఉంటారని, పేద గృహినిలు తమ పిల్లలను చదివించుకునేందుకు ఇబ్బంది పడకుండా ప్రతి ఆడపడుచుకు సహాయం అందించాలని ఉద్దేశంతో అమ్మఒడి,


విద్యాదీవన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, వంటి పథకాలు ప్రవేశపెట్టి పిల్లలకు పౌష్టికాహారాన్ని, పిల్లల తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు పంపిణీ చేసి అందిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  జెడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ బాల చిన్ని, పంచాయతీ సెక్రెటరీ తారకేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ,  కొత్తగా మంజూరైన పింఛను లబ్ధిదారులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: