గ్యాస్ ఆధారిత సరికొత్త స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ మోడల్ తీసుకొచ్చిన మారుతి సుజుకి


కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మార్కెట్ లోకి కొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. గ్యాస్ ఆధారిత సరికొత్త స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ మోడల్ ను తీసుకువచ్చింది. ఇది సీఎన్జీతో నడిచే కారు. దీంట్లో వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ పేరిట రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు రూ.7.77 లక్షలు, రూ.8.45 లక్షలుగా ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి వచ్చిన గ్యాస్ ఆధారిత కార్లలో స్విఫ్ట్-ఎస్ సీఎన్జీ 9వ మోడల్. ఇప్పటికే ఆల్టో, వాగన్ ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ, టూర్-ఎస్ వాహనాల సీఎన్జీ వెర్షన్లు విడుదలయ్యాయి. 

ఇదిలావుంటే కొత్తగా వస్తున్న స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ ఒక కిలో గ్యాస్ తో 30.90 కిమీ ప్రయాణించవచ్చని మారుతి వర్గాలు వెల్లడించాయి. ఇందులో ప్రధానంగా 1.2ఎల్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ ను అమర్చారు. భారత్ లో ప్రస్తుతం ఉన్న సీఎన్జీ హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఇదే అత్యంత శక్తిమంతమైది. అంతేకాదు, గ్యాస్ ఆధారిత వాహనాల్లో అత్యధిక మైలేజి ఇచ్చే వాహనం కూడా ఇదే.  ఇందులోని గ్యాస్ లీక్ కాకుండా స్టెయిన్ లెస్ స్టీలు పైపులు, లోహపు జాయింట్లు పొందుపరిచారు. గ్యాస్ నింపే సమయంలో కారు స్టార్ట్ కాకుండా మైక్రోస్విచ్ ఏర్పాటు చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: