నిబంధనలకు విరుద్ధంగా..... ఉపాధ్యాయుల డ్యూటీలు

బీటీఎఫ్ నాయకులు సతీష్ కుమార్ విమర్శ

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల డ్యూటీలు వేస్తున్నారని బీటీఎఫ్ నాయకులు సతీష్ కుమార్ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షల విధులు నిర్వహిస్తున్న టీచర్లను స్కూళ్లకు పంపాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మాట్లాడుత..,నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లా లో జరుగుతున్న ఓపెన్ స్కూల్ పదవ తరగతి, సప్లమెంటరీ పరీక్షల ఇన్విజిలేటర్ విధులు నిర్వహిస్తున్నారు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 80 కిలోమీటర్ల లోపు పని చేసే టీచర్లకు ఓపెన్ స్కూల్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఇంజ్యులేటర్ విధులు అప్పగించడం ఎంతవరకు సమంజసం అని, అధికారులు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే ఉపాధ్యాయులపై కుంటి సాకులు చూపుతూ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నారని,. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు

స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు బోధనలో ఏలా న్యాయం చేస్తారని, విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు నంద్యాలలోగాని, కర్నూలులోగాని, ఎక్కడైనా సరే ఉద్యోగం చేయడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని,  2017 బదిలీల్లో మోసాలు చేసిన టీచర్లపై (ఆనంద్ బాబు, వనజాక్షిలపై) ఐదేళ్లు గడిచిన చర్యలు తీసుకోలేదని, మహిళా ఉపాధ్యాయులను వేధించిన డీఈఓ సాయిరాం, ఎంఇఓ బ్రహ్మం లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, 2012 మరియు 2013 విద్యాసవత్సరాల్లో నిధులు స్వాహా చేసిన ఎంఇఓ లు, హెచ్.ఎం లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లో అలసత్వం ప్రదర్శిస్తున్నారని,


నంద్యాల మరియు కర్నూలు పట్టణాలలో నివసిస్తూ 80 కి.మీ దూరంలో ఉన్న ఆత్మకూరు మండలం, వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తు, పదవ తరగతి విద్యార్థులకు బోధన చేస్తున్న  ఎస్.జాకీర్ హుస్సేన్, నంద్యాల పరీక్షా కేంద్రానికి పి.వలిభాష, కర్నూలు పరీక్షా కేంద్రానికి నిబంధనలకు వ్యతిరేకంగా పదవ తరగతి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షల ఇన్విజిలేటర్ విధులు  వేయడం ఎంతవరకు సబబని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. తక్షణమే ఇరువురు ఉపాధ్యాయులను పాఠశాలకు పంపాలని ,అక్రమ మార్గంలో మహిళా ఉపాధ్యాయులను వేధించిన డీఈఓ సాయిరాం, ఎంఇఓ బ్రహ్మం లపై, నిధులు స్వాహా చేసిన ఎంఇఓ లు, హెచ్.ఎం లపై తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం చేస్తున్న వారిపై, బదిలీల్లో మోసాలు చేసిన టీచర్లు ఆనంద్ బాబు, వనజాక్షిలపై ఐదేళ్లు గడిచిన చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో? సమాధానం చెప్పాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: