మొహరం పండుగ సందర్భంగా,,,

పెసరవాయి గ్రామంలో భారీ బందోబస్తు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో జరుగు మొహరం పండుగ కు గడివేముల మండలం లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. పెసరవాయిలో జరిగే పీర్ల పండుగను జరుపుకోవడానికి మరియు చూడడానికి ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాక ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి వచ్చి మొహరం పండుగను జరుపుకుంటారు. మొహరం పండుగ సందర్భంగా పెసరవాయ్ గ్రామంలో హిందూ,ముస్లిం సోదర, సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో మొహరం పండుగను జరుపుకుంటారు . మొహరం పండుగ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లును విధులు నిర్వహించేలా చర్యలు తీసుకొని భారీ బందోబస్తు ను పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేశారు. గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పెసర వాయి గ్రామం లోని పురవీధుల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: