మా వీధిలో కుళాయిలు ఏర్పాటు చేయండి...

గడివేముల ఎస్సీ కాలనీ ప్రజలు విన్నపం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

నంద్యాల జిల్లా,గడివేముల మండలంలోని స్థానిక ఎస్సీ కాలనీ వీధిలోని ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సీ కాలనీ లో మా వీధి ఏర్పడి  దాదాపు 15 సంవత్సరాలు అయిందనీ,కానీ నేటి వరకు కూడా మా వీధికి  నీటి కుళాయిలు లేవని, నిత్యవసరాలకు ఉపయోగపడే నీరుని తెచ్చుకునేందుకు ప్రక్క వీధులకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు, అధికారులకు మా వీధిలో కుళాయిలను ఏర్పాటు చేయాలని అనేక పర్యాయాలు వినతి పత్రాలను కూడా అందజేశామని, వినతి పత్రాలు ఇచ్చినా మా వీధిలో కుళాయిలు ఏర్పాటు చేసి నీటి సమస్యను తీర్చేందుకు ఉన్నతాధికారులు, అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు, అధికారులు స్పందించి మా వీధిలో కుళాయిలను ఏర్పాటు చేసి నీటి సమస్యను తీర్చవలసిందిగా ఎస్సీ కాలనీ వీధిలోని ప్రజలు కోరుకుంటున్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: