గడివేముల  జిల్లా పరిషత్ హై స్కూల్ నందు...

*ఆజాదీ కా అమృత్* మహోత్సవ కార్యక్రమం

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నంద్యాల జిల్లా ఎస్పీ కే. రఘువీరా రెడ్డి  ఆదేశాల మేరకు గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య  ఆధ్వర్యంలో *ఆజాదీ కా అమృత్* మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వజ్రోత్సవ  కార్యక్రమంలో గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి ,EORD ఖాలిక్ బాషా, తహసిల్దార్ శ్రీనివాసులు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, జెఎస్డబ్ల్యు సిమెంట్ ఫ్యాక్టరీ సిబ్బంది సాంబశివుడు, రవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి విజయ సింహారెడ్డి  మాట్లాడుతూ పిల్లలలో మరియు పెద్దలలో దేశభక్తిని పెంపొందించుకునేందుకు ప్రధానమంత్రి మోడీ   ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారని కావున ప్రతి విద్యార్థి వారి వారి ఇళ్లపై జెండాను ఎగరవేయాలని తెలిపారు.


గడివేముల ఎస్సై బీటీ. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ దేశంలో నివసించే ప్రజలు కొంతమంది దీపావళి ,రంజాన్, క్రిస్మస్ పండగలను  జరుపుకుంటారు, అయితే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో నివసించే ప్రజలందరూ జెండా పండుగను చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ *ఆజాదీ కా అమృత్* మహోత్సవ వజ్రోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, పిల్లలకు చిన్నతనం నుండే భారతదేశ పై భక్తిని పెంపొందించుకునే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఆవిష్కరించి  దేశభక్తిని చాటుకోవాలని తెలిపారు.


గడివేముల మండలంలోని గడిగరేవుల హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు, మోడల్ హైస్కూల్  విద్యార్థిని, విద్యార్థులు, శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు పాటల పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీలలో మరియు పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఆగస్టు 15వ తేదీన గడివేములలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులను అందజేస్తామని గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: