కూల్చివేసిన మస్జిదును పునర్నించాలని...

మంత్రికి వినతిపత్రం అందజేత

(జానో జాగో వెబ్ న్యూస్- హైద్రాబాద్ ప్రతినిధి)

షంషాబాద్ లో కూల్చివేసిన ఖాజా మహ్మూద్ మస్జిదును పునర్నించాలని, కూల్చివేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ముస్లిమ్ సంఘాలు మైనారిటీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వినతిపత్రం అందించాయి. గురువారం ముస్లిమ్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ముహమ్మద్ అబ్దుల్ అజీజ్, జేఏసీ కన్వీనర్ సనాఉల్లా ఖాన్, ఇతర ముస్లిమ్ నాయకులు మంత్రిని కలిశారు. మస్జిదును ప్రభుత్వ వ్యయంతో నిర్మించాలని, లేనిపక్షంలో రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ముస్లిమ్ సంఘాలు వినతిలో పేర్కొన్నాయి. వినతిపత్రం అందించిన వారిలో జేఏసీ నాయకులు అఫ్జల్, నయీముల్లాషరీఫ్, తన్వీర్ అహ్మద్ తదితరులున్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: