గడివేముల మండలంలో ఘనంగా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వాడవాడలో రెపరెపలాడిన జాతీయ పతాకం

ఎమ్మార్వో కార్యాలయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండలంలో ఆజాదీ కా అమృత్ వజ్రోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.గడివేముల మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ నాగమద్దమ్మ , తాసిల్దార్ కార్యాలయం, శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ నందు  తహసిల్దార్ శ్రీనివాసులు.  పోలీస్ స్టేషన్ మరియు ఆటో యూనియన్ స్టాండ్ నందు ఏఎస్ఐ  వెంకటేశ్వర్లు,జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో గడివేముల జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ " హర్ ఘర్ తిరంగా" నినాదంతో 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి ప్రజలందరూ ఆజాదీ కా అమృత్ పండుగలు జరుపుకున్నామని, నేడు ప్రజలందరూ స్వేచ్ఛ, స్వతంత్రాలతో జీవించేందుకు


నాడు ఎందరో భరతమాత ముద్దుబిడ్డల త్యాగాల ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న "ఆజాదీ కా అమృత్ " వజ్రోత్సవ వేడుకలకు నిదర్శనమని, కొంతమంది దేశభక్తులు తిరుగుబాటు ద్వారానే స్వాతంత్రం లభిస్తుందని నమ్మిన సుభాష్ చంద్రబోస్, నేతాజీ ,భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వీరులు భరతమాత స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగాలు చేశారని, కొంతమంది దేశభక్తులు అహింసా మార్గం ద్వారా నే

ఎంపీడీవో కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ నాగమద్దమ్మ

 భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మిన గాంధీ,నెహ్రూ ల ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ మార్గాల ద్వారా ఆంగ్లేయులు భారతీయుల ప్రాణాలు తీస్తున్న లెక్కచేయకుండా అహింసా మార్గాన్ని  వీడనాడకుండా భారత దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం అలుపెరుగని పోరాట ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలకు నిదర్శనమని మహనీయులను స్మరించుకున్నారు.

స్థానిక ఆటో బస్టాండ్ లోనీ ఆటో యూనియన్ డ్రైవర్లు ఆటోలకు త్రివర్ణ పతాకాలు కట్టుకొని 60 ఆటోలతో "భారత్ మాతాకీ జై" నినాదాలతో గడివేముల ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆటో స్టాండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఏఎస్ఐ వెంకటేశ్వర్లు 

నంద్యాల జిల్లా ఎస్పీ కోటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఆగస్టు 10వ తేదీన వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గడివేముల ఎస్సై బీటీ. వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి పై నిర్వహించిన వ్యాసరచన పోటీలు మరియు పాటల పోటీలు నిర్వహించారు విజేతలైన విద్యార్థిని, విద్యార్థులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది వారికి బహుమతులను అందజేశారు.

శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు 75 అడుగుల త్రివర్ణ పతాకాన్ని చేతపూని గ్రామంలోని పురవీధులలో "భారత్ మాతాకీ జై" " వందేమాతరం" నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో EORD ఖాలిక్ భాష ,జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, శ్రీ రాజరాజేశ్వరి కరస్పాండెంట్ రామేశ్వరరావు,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్ బాల చిన్ని,ఎంపీపీ వంగాల మహేశ్వర్ రెడ్డి,పాణ్యం వెంకటేశ్వర్లు,విద్యార్థిని, విద్యార్థులు, , ఆటో డ్రైవర్లు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

వ్యాసరచన పోటీలలో మరియు పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ASI వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది 

జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో బహుమతులను అందజేస్తున్నగడివేములజెడ్పీటీసీ. ఆర్బి. చంద్రశేఖర్ రెడ్డి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: