పోలీసులు అడ్డుకున్న..

పిన్నాపురం గ్రామానికి వెళ్ళిన సిపిఐ నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, పాణ్యం నియోజకవర్గం పరిధిలోని, పిన్నాపురం గ్రామంలోని రైతులు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో పాణ్యం మండలం పిన్నాపురం గ్రామానికి వందలాది మంది సిపిఐ కార్యకర్తలు చలో పిన్నాపురం పేరు మీద పిన్నాపురం గ్రామానికి వెళ్ళగా పాణ్యం పోలీసులు గ్రామానికి వెళుతున్న సిపిఐ నాయకులను, కార్యకర్తలను వెళ్లకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేసి సిపిఐ కార్యకర్తలను అడ్డుకున్నారు. సిపిఐ పార్టీ నాయకులు,కార్యకర్తలు విడిపోయి  గ్రామంలోకి ప్రవేశించి ఆ గ్రామ రైతులను ఆదుకొని భరోసా కల్పించాలని లక్ష్యంతో పోలీసులు అడ్డుకున్న లెక్కచేయకుండా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్,జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాం మూర్తి, భాస్కర్ జిల్లా సమితి సభ్యులు రమేష్ భార్గవ్, బాలకృష్ణ ,సుబ్బారెడ్డి సంజీవులు, సుబ్బరాయుడు, సోమన్న గ్రామంలోకి వెళ్లి గ్రామసభ నిర్వహించారు గ్రామ సభకు పిన్నాపురం గ్రామ ప్రజలు మద్దతు తెలిపి సిపిఐ నాయకులను గ్రామంలోకి స్వాగతించారు.


ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  రామాంజనేయులు,జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో సంస్థ వారు రైతులను మోసం చేసి ఆరువేల ఎకరాల భూమిని 2018 వ సంవత్సరం నుండి లాక్కొని రైతులకు కేవలం తొమ్మిది లక్షల రూపాయలు నష్టపరిహారం కొంతమందికి రైతులకు మాత్రమే చెల్లించారని,2013 వ సంవత్సరం భూ సేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చట్టంలో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని, పిన్నాపురం గ్రామ ప్రజలు ప్రశ్నిస్తే గ్రామ రైతుల పైన పోలీసులు కేసు నమోదు చేసి భయపెట్టడం సరికాదన్నారు.


పిన్నాపురం గ్రామంలో రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారని పానీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు చొరవ తీసుకొని భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలోని రైతులకు ప్రజలకు అన్యాయం చేస్తూ గ్రామంలోకి ఏ రాజకీయ పార్టీ రాకుండా పోలీసుల చేత భయపెట్టడం మానుకోకపోతే ప్రజలు ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పిన్నాపురం గ్రామ రైతుల భూ నిర్వాసితులకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని వారు భరోసానిచ్చారు. ఈ విషయంపై ప్రజలతో, అధికారులతో, గ్రామసభ నిర్వహించి రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: