సుదీర్ఘకాలం తరువాత అక్కడ బొమ్మపడింది

కశ్మీర్ అంటే ఎమిటో అందరికీ  తెలు. నిత్యం కాల్పుల మోత జరిగే ప్రాంతమిది. అలాంటి ప్రాంతంలో సినిమాలు ఆడించడమంటే మామూలు విషయం కాదు. కశ్మీర్ లో 90వ దశకంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందోనన్న భయాందోళనల కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. అయితే, మునుపటితో పోల్చితే ఇప్పుడక్కడ ఓ మోస్తరు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది. ఐనాక్స్ సంస్థ శ్రీనగర్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. ఇది వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 

ఈ మల్టీప్లెక్స్ లో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన సీటింగ్ తో ఈ థియేటర్ ను తీర్చిదిద్దుతున్నారు. ఈ మల్టీప్లెక్స్ సీటింగ్ సామర్థ్యం 520 సీట్లు. ఇందులో ఫుడ్ కోర్టులు, చిన్నారులు ఆడుకునేందుకు మెషీన్ టాయ్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: