కామన్వెల్త్ క్రీడల్లో...చారిత్రాత్మక  విజయం సాధించిన భారత్


క్రీడా రంగంలో భారత్ మరో చారిత్రాత్మక విజయం సొంతం చేసుకొంది. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పసిడి ప్రస్థానం కొనసాగుతోంది. తాజాగా మహిళల లాన్ బౌల్స్ ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్లో నలుగురు సభ్యుల భారత మహిళల జట్టు 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించింది. 

కామన్వెల్త్ క్రీడల చరిత్రలో భారత్ ఇప్పటివరకు లాన్ బౌల్స్ ఈవెంట్లో స్వర్ణం గెలవలేదు. ఈ నేపథ్యంలో, నేడు గెలిచిన పసిడి పతకం చారిత్రాత్మకంగా మారింది. లాన్ బౌల్స్ ఈవెంట్లో ప్రథమస్థానంలో నిలిచిన భారత జట్టుకు రూపా రాణి టిర్కీ కెప్టెన్ కాగా, లవ్లీ చౌబే, పింకీ, నయన్ మోనీ సైకీ ఇతర సభ్యులు. తాజా పతకంతో బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 4కి చేరింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: