మహిళా ఎంపీలకు...గల్లా జయదేవ్ విందు

మహిళా ఎంపీలకు  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విందు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా వర్షాకాల సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పలు పార్టీలకు చెందిన మహిళా ఎంపీలకు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. 

డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు గల్లా నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి, సోదరి డాక్టర్ గౌరినేని రమాదేవి తదితర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను గల్లా జయదేవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: