ఇంకా కులం పేరుతో వేధింపులు...ఓ టీచర్ దుశ్చర్యతో ఆ దళిత బాలుడు

మన సమాజం ఎంతగా పురోగమిస్తున్నా కులం విషయంలో అగ్రవర్ణాలలో మార్పు రావడంలేదు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కులం పేరుతో ధారుణం చోటుచేసుకొంది. ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. పసివాడనే జాలి కూడా లేకుండా వేధించాడు. స్కూల్ ముగిసే సమయంలో టాయిలెట్‌లో పెట్టి తాళం వేసేశాడు. ఇంతకీ దళితుడు కావడమే ఆ విద్యార్థి చేసిన శాపమైంది. ఈ అమానవీయమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భిదూనా ప్రాంతంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ 11 ఏళ్ల విద్యార్థి పట్ల అదే స్కూల్లో పని చేస్తున్న టీచర్ కర్కశంగా ప్రవర్తించాడు.

ఈ సంఘటన ఆగస్ట్ 5వ తేదీన జరిగింది. పాఠశాల ముగిసే సమయానికి టీచర్.. ఆ 11 ఏళ్ల చిన్నారిని బాత్‌రూమ్‌లోకి లాక్కెల్లి డోర్ వేసి.. తాళం వేసేశాడు. అయితే అది తెలియని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయార్. అయితే బాత్రూమ్‌లో ఉన్న పిల్లవాడు సాయం కోసం అరిచాడు. కానీ ఎవరూ రాలేదు. దీంతో రాత్రంతా మరుగుదొడ్డిలోనే ఉండిపోయాడు. అలా 18 గంటలపాటు బాత్రూమ్‌లోనే ఉండిపోయాడు. అయితే పిల్లవాడు ఇంటికి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఊరంతా వెదికారు. కానీ ప్రయోజనం లేకపోయింది.

తర్వాత పాఠశాల తెరవగానే.. ఇతర టీచర్లతో పాటు బాలుడు తల్లిదండ్రులు కూడ వెళ్లారు. కానీ స్కూల్లో ఎక్కడా బాలుడు కనిపించలేదు. చివరకు బాత్రూమ్ ఓపెన్ చేయగా చిన్నారి అందులో ఏడుస్తూ కనిపించాడు. వెంటనే బాలుడు బయటకొచ్చి.. టీచర్ చేసిన పని గురించి తెలియజేశారు. దాంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేశారు.

ఇదిలావుంటే రాజస్థాన్‌లోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. తన కుండలో నీళ్లు తాగాడనే కోపంతో ఓ దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దాంతో పిల్లవాడికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఆదివారం మరణించాడు. దాంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: