రైతులను పరామర్శించిన...

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో  జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా కలెక్టర్. నంద్యాల జిల్లా,పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, ఓర్వకల్ మండలంలోని, ఉప్పలపాడు గ్రామ సమీపంలోని పేదలందరికీ ఇళ్లు- నవరత్నాలు పథకం కింద జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ .పి.కోటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం నిన్నటి రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పలపాడు గ్రామంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో దెబ్బతిన్న  మొక్కజొన్న పంటలను పరిశీలించారు.


అనంతరం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ పి. కోటేశ్వరరావు  మాట్లాడుతూ...రైతులను అధైర్యపడవద్దని ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఓర్వకల్లు మండల  జెడ్పిటిసిలు, ఎంపీపీ,సర్పంచులు,ఎంపీటీసీలు,సంబంధిత అధికారులు ఉప్పలపాడు గ్రామ రైతులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: